---Advertisement---

టాలీవుడ్ బాక్సాఫీస్ దడ పుట్టించే టాప్ పాన్ ఇండియా మూవీస్ – upcoming pan india movies telugu

By Mahesh

Published On:

Follow Us
upcoming pan india movies telugu
---Advertisement---

upcoming pan india movies telugu ; టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే రెండేళ్లలో (2026-2027) ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి వస్తున్న మన టాలీవుడ్ టాప్ హీరోల అప్‌కమింగ్ పాన్ ఇండియా మూవీస్ లైనప్, వాటి రిలీజ్ డేట్స్ మరియు ఎన్ని భాషల్లో రాబోతున్నాయనే పూర్తి వివరాలు మీకోసం:

1. ప్రభాస్ (Prabhas) – upcoming pan india movies telugu

పాన్ ఇండియా బాక్సాఫీస్ రారాజు ప్రభాస్ లైనప్‌లో భారీ యాక్షన్ చిత్రాలు క్యూ కట్టాయి:

ఫౌజీ (Fauji): హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా 16 అక్టోబర్ 2026న రిలీజ్ కానుంది. (5 పాన్ ఇండియా భాషల్లో)

సలార్ 2 – శౌర్యాంగ పర్వం (Salaar: Part 2): ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 14 నవంబర్ 2026 కు షెడ్యూల్ చేయబడింది. (5 భాషల్లో)

స్పిరిట్ (Spirit): సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌లో రఫ్ అండ్ రస్టిక్ కాప్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా 5 మార్చి 2027న రిలీజ్ కానుంది. (పాన్ ఇండియా భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లో)

2. మహేష్ బాబు (Mahesh Babu) – upcoming pan india movies telugu

SSMB29 (Varanasi): ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ సినిమా టైటిల్ ‘వారణాసి’ అని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 25 మార్చి 2027 న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 పైగా ప్రధాన భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్) రిలీజ్ చేయనున్నారు.

3. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)

upcoming pan india movies telugu ; ఎన్టీఆర్-నీల్ (NTRNeel – Dragon): ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) పై భారీ అంచనాలున్నాయి. మొదట ఈ సినిమాను 2026 జూన్‌లో తీసుకురావాలని ప్లాన్ చేసినప్పటికీ, లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇది 2027 కి పోస్ట్‌పోన్ అయింది. (5 పాన్ ఇండియా భాషల్లో)

4. రామ్ చరణ్ (Ram Charan)

పెద్ది (Peddi): బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా 30 ఏప్రిల్ 2026న రిలీజ్ కానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. (5 పాన్ ఇండియా భాషల్లో)

RC17: సుకుమార్ డైరెక్షన్‌లో రంగస్థలం మ్యాజిక్‌ను రిపీట్ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ 12 నవంబర్ 2026 న థియేటర్లలోకి రానుంది. (5 పాన్ ఇండియా భాషల్లో)

5. నాని (Nani)

ది ప్యారడైజ్ (The Paradise): శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘దసరా’ తర్వాత నాని నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఇది. ముందుగా ఈ సినిమా మార్చి 2026లో అనుకున్నా, విజువల్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ కోసం 21 ఆగస్టు 2026 కు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ తదితర) గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

6. అల్లు అర్జున్ (Allu Arjun)

upcoming pan india movies telugu ; ‘పుష్ప 2’ తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యూచర్ లైనప్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి:

రాక (Raaka): కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ (Atlee) తో కలిసి వస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ఇది. ఫస్ట్ లుక్‌తోనే వేర్‌వుల్ఫ్ (Werewolf) థీమ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. (5 పాన్ ఇండియా భాషల్లో)

AA23 (లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్): టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ స్టైలిష్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందనుంది. ‘రాక’ తర్వాత ఈ సినిమా 2027 లో సెట్స్ పైకి వెళ్లనుంది.

వీటితో పాటు, బన్నీ తదుపరి చిత్రాల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) లతో కూడా భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read This ; రాకా మూవీ యాక్టర్స్ రెమ్యూనిరేషన్స్ లీక్ అల్లు అర్జున్, దీపికా, రష్మికలకు ఎన్ని కోట్లంటే?

Mahesh

Mahesh is a seasoned Telugu cinema writer and publisher with over 8 years of experience in the digital news space. With a deep passion for Tollywood, he brings fans the latest on everything from breaking news and trailers to box office hits and celebrity insights. Whether it’s an honest movie review, a look behind the scenes, or the latest industry gossip, Mahesh’s goal is to keep film lovers updated on every major event in the industry.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment