---Advertisement---

2026లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్ హీరోయిన్లు

By Mahesh

Published On:

Follow Us
Highest Paid South Indian Actresses
---Advertisement---

Highest Paid South Indian Actresses ; ఇండియన్ సినిమా రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ హీరోయిన్ల క్రేజ్ పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం పాటలకు, గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైన కథానాయికలు, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు.

పాన్-ఇండియా రిలీజ్‌లు, భారీ OTT డీల్స్ కారణంగా సౌత్ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ భారీగా పెరిగింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం సమంత, నయనతార, రష్మిక మందన్న, సాయి పల్లవి, త్రిష లాంటి అగ్రశ్రేణి తారలు ఒక్కో సినిమాకు రూ. 10 నుండి 13 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.

ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఆ టాప్-5 హీరోయిన్ల రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ చూద్దాం.

Highest Paid South Indian Actresses

1. రష్మిక మందన్న (Rashmika Mandanna)

Highest Paid South Indian Actresses ; సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ‘యానిమల్’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె పారితోషికం అమాంతం పెరిగింది.

అంచనా రెమ్యునరేషన్: సినిమాకు రూ. 10–13 కోట్లుతాజా ప్రాజెక్ట్స్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కోసం ఆమె రూ. 10 కోట్లు ఛార్జ్ చేయగా, సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న ‘సికందర్’ చిత్రానికి ఏకంగా రూ. 13 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

2. త్రిష కృష్ణన్ (Trisha Krishnan)

Highest Paid South Indian Actresses ; రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటున్న త్రిష.. ‘పొన్నియిన్ సెల్వన్’ తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె మార్కెట్ వాల్యూ భారీగా పెరిగింది.

అంచనా రెమ్యునరేషన్ సినిమాకు రూ. 10–12 కోట్లుతాజా ప్రాజెక్ట్స్: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమాలకు గాను ఆమె దాదాపు రూ. 12 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్.

3. నయనతార (Nayanthara)

Highest Paid South Indian Actresses ; కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను బ్యాలెన్స్ చేయడంలో ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార స్టైలే వేరు.

అంచనా రెమ్యునరేషన్: సినిమాకు రూ. 8–10 కోట్లు తాజా ప్రాజెక్ట్స్: షారుఖ్ ఖాన్ సరసన నటించిన బాలీవుడ్ డెబ్యూ ‘జవాన్’ కి ఆమె దాదాపు రూ. 10 కోట్లు తీసుకుంది. అంతేకాకుండా, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన తన వెడ్డింగ్ డాక్యుమెంటరీ కోసం ఆమెకు రూ. 25 కోట్లు ముట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

4. సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సమంత.. థియేట్రికల్ రిలీజ్‌లతో పాటు భారీ వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

అంచనా రెమ్యునరేషన్: సినిమాకు రూ. 8–10 కోట్ల తాజా ప్రాజెక్ట్స్: గ్లోబల్ స్పై సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ లో యాక్షన్ రోల్ కోసం సమంత సుమారు రూ. 10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది

5. సాయి పల్లవి (Sai Pallavi)

న్యాచురల్ యాక్టింగ్, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసే సాయి పల్లవి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో ప్రత్యేక డిమాండ్ ఉంది.

అంచనా రెమ్యునరేషన్: ప్రాంతీయ సినిమాలకు రూ. 5–6 కోట్లు తాజా ప్రాజెక్ట్స్: నాగ చైతన్య ‘తండేల్’ లాంటి సినిమాలకు రూ. 5 కోట్లు తీసుకుంటున్న సాయి పల్లవి.. బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ లో సీత పాత్ర కోసం ఏకంగా రూ. 18-20 కోట్లు (రెండు భాగాలకు కలిపి) అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.


పారితోషికాలు ఇంతలా ఎందుకు పెరిగాయి?

పాన్-ఇండియా అప్పీల్: ఒకే సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతుండటంతో మార్కెట్ పరిధి పెరిగింది, దీనివల్ల భారీ బడ్జెట్‌తో పాటు నటీనటుల పారితోషికాలు కూడా పెరిగాయి.

బాలీవుడ్ క్రాసోవర్: సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించగలరు అనే నమ్మకం మేకర్స్‌లో ఏర్పడింది.

డిజిటల్ & శాటిలైట్ రైట్స్: OTT ప్లాట్‌ఫామ్స్ భారీ ధరకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తుండటంతో నిర్మాతలు లాభాల బాట పడుతున్నారు.

Also Read this ; Yash టాక్సిక్ మూవీ కోసం ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా?

Mahesh

Mahesh is a seasoned Telugu cinema writer and publisher with over 8 years of experience in the digital news space. With a deep passion for Tollywood, he brings fans the latest on everything from breaking news and trailers to box office hits and celebrity insights. Whether it’s an honest movie review, a look behind the scenes, or the latest industry gossip, Mahesh’s goal is to keep film lovers updated on every major event in the industry.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment