A aya Sher Song Lyrics in Telugu ;న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా నుంచి “ఆయా షేర్” (Aaya Sher) సాంగ్ విడుదలైంది. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ఊర మాస్ బీట్ ఇచ్చారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పక్కా మాస్ పాట పూర్తి వివరాలు, లిరిక్స్ (పల్లవి, చరణం) మీకోసం.
🎬 సాంగ్ వివరాలు (Aaya Sher Song Details)
- సినిమా: ది ప్యారడైజ్ (The Paradise)
- హీరో: న్యాచురల్ స్టార్ నాని ( Nani )
- సంగీతం (Music): అనిరుధ్ రవిచందర్
- లిరిక్స్ (Lyricist): కాసర్ల శ్యామ్
- డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల
- సింగర్స్: అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్, అర్జున్ చండీ
🎵 ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ (Aaya Sher Song Lyrics in Telugu)
🎵 ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ (Aaya Sher Song Lyrics in Telugu)
[పల్లవి] హే నీ అయ్య జాగీరా
చల్ మావాడొచ్చింద్రా
ఇగ జడ్తియ్యలే
జుంబాలికే ఆయా షేర్
హే ఆ దార్ కా సుల్తానే
మా ఘర్ కా సైతానే
చల్ శికార జెయ్యా
జుంబాలికే ఆయా షేర్
పచ్చ బొట్టు గాయమిది ఆయా షేర్
గుంజుకునే న్యాయమిది ఆయా షేర్
బూడిదల గడ్డ ఇది ఆయా షేర్
మాతో రాయబడ్ద కథే ఇది ఆయా షేర్
[కోరస్] జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతరో తొడలురో తీస్తరో తొలురో
సవారికి దొరుకు బిడ్డా
సేవలే లేస్తాయి బిడ్డా
పేగులు తీసి మెడల ఏసి
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా
[చరణం 1] ఆడ ఈడ యెడ జూడు బిడ్డా
వణుకై పుట్టలింక పడితేనే నా నీడ
బొంద పెడుత మాలిక్నైనా గూడా
వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా
చల్ ఉడుకుతుందీ సారా బట్టిలో మా కంట తడే
జుంబాలికే ఆయా ఆయా షేర్
ఇగ రాలుతది బొట్టు బొట్టులో నీ పంచె తడే
జుంబాలికే ఆయా ఆయా షేర్
(జడలురో జడలురో హడలురో ధడలురో… సేవలే లేస్తాయి బిడ్డా
పేగులు తీసి మెడల ఏసి ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా)
[చరణం 2] హే బరి బత్తలున్నొన్నిరా
బార్ బాధే అయినొన్నిరా
నన్ను పీకుతవా జుంబాలికే ఆయా షేర్
హే మోల్దారం లేనొన్నిరా
నీ కన్నా ముందొన్నిరా
ఇగ పీకుతవా జుంబాలికే ఆయా షేర్
పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్
మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్
పేరు పతా లేనొన్నిరా ఆయా షేర్
చూస్కో పారడైస్ కు అడ్రెస్ ఐత ఆయా షేర్
ఇదికూడా చదవండి ; NTR31 Update: ప్రశాంత్ నీల్ సైలెన్స్ వెనుక రీజన్ ఇదే! బడ్జెట్ & రిలీజ్ డేట్ వివరాలు











